: మీడియాతో క్షమాపణలు చెప్పించిన మహిళ కట్టుకథ!


అంతర్జాతీయ మీడియాతో క్షమాపణలు చెప్పించిన కట్టుకథను ఓ మహిళ ప్రచారం చేసి కలకలం రేపింది. సోషల్ మీడియా ప్రభావంతో ఏది వాస్తవం? ఏది అబద్ధం? అనేది తేల్చుకోవడం కష్టమైపోతుందని నిరూపించే ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. ట్విట్టర్లో @ఆఫ్ జస్ట్ కుతి అనే యువతి తన స్నేహితురాలు కామోను కామాంధులు అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారంటూ మూడు రోజుల క్రితం ఓ కథను పోస్టు చేసింది. ఆమె పోస్టు కథనం చదివిన చాలా మంది కామోపై సానుభూతి చూపించారు. ఆమెను రేప్ చేసిన వారికి శాపనార్థాలు పెట్టారు. ఇలా జరిగి ఉండకూడదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆమె కథనం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఈ కథనాన్ని మీడియా ప్రచురించింది. దీంతో ఈ కథనానికి మరింత ఆదరణ లభించింది. సౌతాఫ్రికా మొత్తం దీని గురించి స్పందించింది. సౌతాఫ్రికా మహిళా విభాగం దీనిపై స్పందిస్తూ, ఇలాంటి దారుణాలపై తిరగబడండంటూ పిలుపునిచ్చింది. దీంతో ఈ కథను ప్రచారంలోకి తెచ్చిన మహిళను ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. దీంతో ఇది వాస్తవం కాదని, తాను ఓ పత్రికలో చదివిన కథను పేర్లుమార్చి, కొంత కథనం చేకూర్చి ట్విట్టర్లో పెట్టానని, అది కథే అయినప్పటికీ మహిళల పరిస్థితి అలాగే ఉందని సమర్థించుకుంది. తాను కట్టుకథను పెట్టానని చెప్పడంతో అంత వరకు సానుభూతి చూపిన వారు ఇది కథా? అని నవ్వుకోగా, దీనిని వాస్తవంగా భ్రమించి ప్రచురించిన వార్తా సంస్థలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాయి. దీనిపై ఓ మీడియా సంస్థ అధినేత మాట్లాడుతూ, నిర్ధారించుకోకుండా ప్రచురించడం జర్నలిజం అనిపించుకోదని, జర్నలిజంలో విలువలు తగ్గిపోతున్నాయని, ఈ కథ మీడియా పరిశ్రమకు పెద్ద గుణపాఠమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News