: ఢిల్లీలోని పాక్ ఎయిర్ లైన్స్ ఆఫీసుపై హిందూ సేన దాడి!
న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని నారాయణ్ మంజిల్ లో ఉన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సిటీ ఆఫీసుపై కొద్ది సేపటి క్రితం హిందూ సేన కార్యకర్తలు దాడి చేశారు. ఇండియాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ, దాడికి వచ్చామని నినాదాలు చేసిన ఆందోళనకారులు, కార్యాలయంలోని ఫర్నీచరును ధ్వంసం చేశారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఘటనా స్థలికి చేరి హిందూ సేన కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.