: కేంద్ర మంత్రి జయంత్ సిన్హా భార్యకు ఇన్ఫోసిస్ లో డైరెక్టర్ పదవి


ఇండియాలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఔట్ సోర్సింగ్ సంస్థ ఇన్ఫోసిస్ లో ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా భార్య పునీతా సిన్హాను నియమించినట్టు ఇన్ఫీ వెల్లడించింది. నేడు ఆర్థిక ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్, స్టాక్ మార్కెట్లలో, నిధుల నిర్వహణలో 25 సంవత్సరాలకు పైగా అనుభవమున్న పునీత, తమ బోర్డును మరింత బలోపేతం చేయగలదని భావిస్తున్నట్టు పేర్కొంది. పునీత నియామకంపై మార్కెట్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మంత్రి భార్యను బోర్డులోకి తీసుకోవడంపై కొందరు విమర్శిస్తుండగా, అది ఆమె సాధించిన ఘనతగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. కాగా, పునీతకు పలు అమెరికన్ కంపెనీల్లో, ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది.

  • Loading...

More Telugu News