: పాక్ తో చర్చలు వాయిదా... తిరిగి ఎప్పుడో చెప్పలేమన్న కేంద్రం
అనుకున్నట్టుగానే పాకిస్థాన్ తో జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. ఇటీవలి పఠాన్ కోట్ దాడుల తరువాత చర్చలు వాయిదా పడవచ్చని భావిస్తూ రాగా, అందుకు తగ్గట్టుగానే, ఈ మధ్యాహ్నం కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతానికి చర్చలను జరపకూడదని నిర్ణయించామని, తదుపరి చర్చలు జరుగుతాయా? జరగవా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని, పాక్ అధికారులతో చర్చించి చర్చల పునరుద్ధరణపై నిర్ణయిస్తామని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, పాక్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ నేత మసూద్ అజర్ అరెస్ట్ పై అనుమానాలు వీడలేదు. పాక్ అధికారులు సైతం తమకు సమాచారం లేదని స్పష్టం చేస్తుండటంతో, మసూద్ అరెస్ట్ వార్తలు అవాస్తవమని తెలుస్తోంది.