: ఆర్టీసీని నష్టాల్లో పెట్టి...ప్రైవేటు బస్సులను పెంచి పోషిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్


తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నష్టాల పాలు చేసే ఎత్తుగడలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల నుంచి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు దోపిడీకి పాల్పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రైవేటు ట్రావెల్స్ ను పెంచి పోషించేందుకు ఆర్టీసీని దివాలా సంస్థగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News