: అప్పట్లో కేసీఆర్ అడిగితే ఎన్నో పనులు చేసిపెట్టా!: జైపాల్ రెడ్డి


గ్రేటర్ హైదరాబాదును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వారు ఓ సారి ఆలోచించాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను కేంద్ర మంత్రిగా ఉండగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులకు దేశానికి సంబంధించిన డబ్బును ఇచ్చానని అన్నారు. నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంచి నీటి సౌకర్యానికి డబ్బులిచ్చానని ఆయన చెప్పారు. అప్పట్లో కేసీఆర్ అడిగితే ఎన్నో పనులు చేశానని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాదును తానే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పుడు హైదరాబాదును అందరూ అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News