: ఓబామాతో సెల్ఫీ దిగి సంబరపడుతున్న మల్లికా షెరావత్


బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ తెగ సంబరపడిపోతోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ఓ సెల్ఫీ దిగిన మల్లిక, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, 'విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా' అని ఓ ట్యాగ్ లైన్ ను కూడా పెట్టింది. కొద్ది కాలంగా అమెరికాలో పర్యటిస్తున్న మల్లిక, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఒబామాను కలుసుకుని ఈ ఫోటో దిగినట్టు తెలుస్తోంది. అన్నట్టు మల్లిక పెట్టిన ఈ ఫోటోకు 96 రీట్వీట్లు 477 లైక్ లు మాత్రమే వచ్చాయి.

  • Loading...

More Telugu News