: అందరికీ అవకాశం ఇచ్చారు...టీఆర్ఎస్ కీ అవకాశం ఇవ్వండి: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఛైర్మన్ పదవిని అన్ని పార్టీల వారికి ప్రజలు కట్టబెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేవలం టీఆర్ఎస్ కు మాత్రమే గ్రేటర్ ప్రజలు అధికారం కట్టబెట్టలేదని అన్నారు. ఈసారి టీఆర్ఎస్ కు అధికారం కట్టబెడితే గత 50 ఏళ్లలో పాలకులు చేయలేనివన్నీ చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. రానున్న ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు హైదరాబాదుకు చేసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.