: విదేశాల నుంచి వచ్చిన 'మేకిన్ ఇండియా' సింహం!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా' ప్రచారాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి, పెట్టుబడిదారుల్లోకి తీసుకువెళ్లేందుకు తయారుచేసిన సింహం లోగోను ఓ విదేశీ కంపెనీ రూపొందించిందట. విస్తుగొలిపే ఈ విషయం స.హ చట్టం ఉపయోగించి ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. మధ్యప్రదేశ్ కు చెందిన స.హ చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పోర్ట్ లాండ్ కేంద్రంగా నడుస్తున్న వైడెన్ ప్లస్ కెన్నెడీ సంస్థ ఈ లోగోను తయారు చేసినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. లోగో తయారీకి ఏ విధమైన టెండర్లను పిలవలేదని, ఆ సంస్థకు ఉన్న పేరు, అడ్వర్టయిజింగ్ విభాగంలో ఉన్న ప్రాతినిధ్యాన్ని గుర్తించి, ఈ కాంట్రాక్టును అప్పగించామని తెలిపింది. లోగో ప్రచారం నిమిత్తం రూ. 11 కోట్లతో వైడెన్ ప్లస్ కెన్నడీతో డీల్ కుదుర్చుకున్నామని, ప్రత్యేకించి లోగో తయారీకి డబ్బివ్వలేదని పేర్కొంది. కాగా, ఎంతో మంది ఔత్సాహికులున్న భారత్ లో లోగో తయారు చేయాలని ఒక్కసారి కోరితే, వేలకొద్దీ మోడల్స్ వచ్చేవి కదా? అని ఇప్పుడు మార్కెటింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News