: గతంలో సెటిలర్స్ ను తిట్టినందుకు క్షమాపణలు చెప్పు!: కేసీఆర్ పై రేణుకా చౌదరి నిప్పులు
గతంలో హైదరాబాద్ లో నివసిస్తున్న సెటిలర్లను దూషించినందుకు కేసీఆర్, తొలుత క్షమాపణలు చెప్పాలని, ఆ తరువాతనే వారిని ఓట్లడగాలని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. అసలు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిన వారి కృషి వల్లే నగరం అభివృద్ధిలో దూసుకెళ్లిందని చెప్పిన ఆమె, ఎన్నో పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. గ్రేటర్ లో 100 సీట్లు సాధించకుంటే రాజీనామా చేస్తానని చెబుతున్న ఐటీ మంత్రి కేటీఆర్, ముందు పదవిని వదిలి ఎన్నికల్లో ప్రచారానికి రావాలని కోరారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా నగరంలోని సెటిలర్స్ కు అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపిన రేణుక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు.