: ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న నటుడు నండూరి ఉదయ్ కిరణ్ మోసాలు!


రెండు రోజుల క్రితం కాకినాడలోని ఓ బార్ లో విధ్వంసం సృష్టించి అరెస్టయిన వర్ధమాన సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతని చరిత్రను తవ్వుతున్న పోలీసులు విస్తుపోయే నిజాలను తెలుసుకుంటుండగా, తమను ఉదయ్ మోసం చేశాడని ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తూ, యాంటీ నార్కోటిక్స్ సెల్ పోలీసులకు పట్టుబడ్డాడని కాకినాడ పోలీసులు వెల్లడించారు. నైజీరియన్ వ్యక్తులతో సంబంధాలు నడిపాడని వివరించారు. ఇదిలావుండగా, కాకినాడలోని ఓ మహిళ, తన కుమారుడికి ఉద్యోగం నిమిత్తం గత సంవత్సరం రూ. 2 లక్షలు ఇచ్చానని, ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులడిగితే బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో మహిళ, ఆమె సోదరుడు సైతం ఇదే విధమైన ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం రైల్లో పరిచయం అయిన శారద అనే యువతికి హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో రూ. 50 వేల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ. 3 లక్షలు వసూలు చేశాడు. ఆపై చంపుతానని బెదిరించడంతో వెనక్కు తగ్గిన ఆమె, ఉదయ్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకుని కాకినాడకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఉదయ్ పై 2006లోనే సస్పెక్ట్ షీట్ ఓపెనైందని తెలుసుకున్న పోలీసులు మొత్తం కేసులను మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News