: జకార్తాలో కాల్పుల మోత... టర్కీపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు


ఉగ్రవాదుల పంజాతో ఇండోనేసియా రాజదాని జకార్తాతో పాటు టర్కీలోనూ కలకలం రేగింది. నేటి ఉదయం సెంట్రల్ జకార్తాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో బాంబులు పేల్చిన ఉగ్రవాదులు సమీపంలోని ఓ కేఫ్, షాపింగ్ మాల్ లపైనా విరుచుకుపడ్డారు. ఈ ఘటనల్లో ఇప్పటిదాకా ఆరుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. తమను నిలువరించేందుకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే... జకార్తాలో బాంబు పేలుళ్లు, కాల్పులు మొదలైన సమయంలోనే టర్కీలోనూ ఉగ్రవాదులు పంజా విసిరారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఇప్పటిదాకా ఐదుగురు చనిపోగా, 39 మంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News