: ఉత్తరాఖండ్ లో వేల కోట్ల స్కామ్: ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ


హరీష్ రావత్ నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ. 3,300 కోట్ల విలువైన కుంభకోణంలో పాత్రధారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. రాష్ట్రంలో జరిగిన స్కాముల్లో ఇదే అతిపెద్దదని, ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు ఇందులో భాగముందని విమర్శించింది. రాష్ట్రంలో డిజిటల్ విధానానికి ప్రాధాన్యత పెంచే దిశగా కుదుర్చుకున్న ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని ఆప్ నేత అనూప్ నౌతియాల్ ఆరోపించారు. రాష్ట్ర పభుత్వానికి, ఇంటర్నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందంలో, హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నువామ్ లిమిటెడ్ తో కుదుర్చుకున్న 500 మిలియన్ డాలర్ల విలువైన డీల్ లో అవతకవకలు చోటు చేసుకున్నాయని, అక్రమంగా నగదు తరలింపులు జరిగాయని అనూప్ వివరించారు. ఈ కంపెనీల గత చరిత్రలు, డైరెక్టర్ల వివరాలు, కంపెనీ రిజిస్టర్ అయిన చిరునామాలు తెలియడం లేదని అన్నారు. ఆ కంపెనీలు గతంలో ఇండియాలో ఏవైనా ప్రాజెక్టులు చేపట్టాయా? లేదా? అన్న విషయంలోనూ సమాచారం లేదని తెలిపారు. ఈ ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. ఈ డీల్స్ వెనుక ఒక్క రూపాయి విలువైన నగదు లావాదేవీ కూడా లేదని, ఇవన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొంది.

  • Loading...

More Telugu News