: మీ దారి మరణం దగ్గరికే... పాక్ ప్రభుత్వానికి మౌలానా మసూద్ హెచ్చరిక


పాక్ ప్రభుత్వానికి జైషే మొహమ్మద్ నేత మౌలానా మసూద్ అజర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఇండియాకు దగ్గర కావాలని పాక్ వేస్తున్న అడుగులు మరణాన్ని దగ్గర చేస్తాయని వ్యాఖ్యానించిన ఆయన, పాలకులు ఎంచుకున్న మార్గం దేశానికే ప్రమాదకరమని అన్నాడు. ఈ మేరకు 'అల్-కాలమ్' సాయంత్రం దినపత్రికలో ఓ కాలమ్ రాస్తూ, మసీదులు, మదారసాలు, పవిత్ర యుద్ధానికి, ముస్లిం మత నిబంధనలకు వ్యతిరేకంగా పాక్ అడుగులు వేస్తోందని ఆరోపించాడు. తనను అరెస్ట్ చేసినా, చంపేసినా, తన స్నేహితుల నుంచి దూరం చేసినా భయపడేది లేదని, ఎన్నడో మరణాన్ని ఆహ్వానించానని తెలిపాడు. కాగా, మసూద్ ను అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియా తెలుపగా, ఆ విషయమై అధికారిక ప్రకటనేదీ రాలేదని భారత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News