: మార్కెట్లో బ్లడ్ బాత్... ఆదిలోనే రూ. 1.40 లక్షల కోట్లు హాంఫట్!


ఆసియా దేశాల నుంచి అందిన సంకేతాలు ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో ఈ ఉదయం భారత స్టాక్ మార్కెట్ ఆదిలోనే భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా పడిపోయింది. దాదాపు రూ. 1.40 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. క్రితం ముగింపునాడు రూ. 95,98,662 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, నేటి ఉదయం 9:30 గంటల సమయంలో రూ. 94,54,253 కోట్లకు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 24,600కు దగ్గరైంది. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 4 శాతం, కొరియా సూచిక స్ట్రెయిట్స్ టైమ్స్ 1.78 శాతం, హాంగ్ సెంగ్ 1.66 శాతం, తైవాన్ సూచిక 1.48 శాతం, కోస్పి 1.48 శాతం, షాంగై కాంపోజిట్ 1.10 శాతం నష్టపోయాయి.

  • Loading...

More Telugu News