: ఒబామా వ్యాఖ్యలే... పాక్ కీలక నిర్ణయానికి కారణం!


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా నిన్న తన వీడ్కోలు ప్రసంగం చేశారు. అధ్యక్షుడి హోదాలో తాను చేసిన చివరి ప్రసంగంలో ఒబామా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్... ఉగ్రవాదానికి కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదాన్ని ప్రస్తావించిన సందర్బంగా ఒబామా నోటి వెంట పాక్ పేరు కూడా వినిపించింది. ఒబామా నోట వెలువడ్డ ఆ నిందారోపణతో పాకిస్థాన్ లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. అప్పటికే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడికి సంబంధించి విచారణ కోసం పలు కీలక విభాగాలతో సంయుక్త దర్యాప్తు బృందాన్ని నవాజ్ షరీప్ ఏర్పాటు చేశారు. ఒబామా వ్యాఖ్యల నేపథ్యంలో షరీఫ్ తన దేశ దర్యాప్తు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రధాని నుంచి అందిన ఆదేశాలతో రంగంలోకి దిగిపోయిన దర్యాప్తు అధికారులు నిన్న ఉన్నపళంగా జైషే మొహ్మద్ కార్యాలయాలపై దాడులు చేశారు. కార్యాలయాలను సీజ్ చేశారు. క్షణాల్లోనే ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్ట్ చేశారు. మసూద్ తో పాటు పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులను కూడా దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఓ ఆసక్తికర కథనం ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News