: భారత్ లో అంతర్జాతీయ స్థాయి విద్యా వ్యవస్థే లేదట
అవును.. లండన్ కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తాజాగా 2016లో ప్రపంచంలో అత్యుత్తమ 200 యూనివర్శిటీల జాబితాను విడుదల చేయగా, దానిలో భారత్ కు చెందిన ఒక్క యూనివర్శిటీ పేరు కూడా లేదు. అంతర్జాతీయ విద్యా వ్యవస్థకు కేంద్ర బిందువుగా లండన్ పేరు పొందింది. కాగా అత్యుత్తమ 200 విశ్వవిద్యాలయాల జాబితాలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్ యూనివర్శిటీలకే ప్రాధాన్యత దక్కింది. ఈ జాబితాలో 28 దేశాలలు స్థానం సంపాదించుకున్నాయి. అయితే భారత్ పేరు నామమాత్రంగా కూడా ఉండకపోవడం విశేషం. ప్రతీ యూనివర్శిటీలో ఉన్న అంతర్జాతీయ నైపుణ్యాలు గల సిబ్బంది, అంతర్జాతీయ స్థాయి విద్యా విధానం, రీసెర్చ్ పేపర్లు తదితర అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.