: గుజరాత్ లో రూ. 700 కోట్లు దాటిన పతంగుల వ్యాపారం


ప్రస్తుతం గుజరాత్ లో ఆకాశం కనిపించడం లేదు. మొత్తం పతంగులన్నీ ఆకాశాన్ని కప్పేసి కనువిందు చేస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా గుజరాత్ లో జరిగే పతంగుల పండుగ ఈ సారి మరింత వైభవంగా జరుగుతోంది. రూ. 700 కోట్లకు పైగా పతంగుల వ్యాపారం జరగడమే ఇందుకు తార్కాణం. ఇక్కడ పతంగుల విక్రయాల కోసం వెలిసిన దుకాణాలతో పాటు, గాలిపటాలు ఎగురవేసే సమయంలో వినోదం కోసం ధరించాల్సిన వస్తువులు అమ్మే దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. మాస్క్ లు, వివిధ రంగుల్లో గల టోపీలు, గొడుగులు, కళ్లజోళ్లు జోరుగా విక్రయిస్తున్నారు.

  • Loading...

More Telugu News