: అగ్రరాజ్యం మేయర్ బరిలో గుంటూరు జిల్లా వాసి


గుంటూరు జిల్లాకు చెందిన హను కర్లపాలెం అమెరికాలో స్థిరపడ్డాడు. ఇప్పుడాయన అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో గల మేడిసన్ నగర మేయర్ పదవికి పోటీపడుతున్నాడు. అలబామా లోని విన్‌హమ్జ్ ప్రాంతంలో నెట్‌వర్క్ సొల్యూషన్స్ సంస్థను నిర్వహిస్తున్న హను.. ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అలబామా ఒకటని, అందులోని మేడిసన్‌కు నాయకత్వం వహించగలనన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మేడిసన్ కు నాయకత్వం వహిస్తున్న ట్రాయ్ ట్రలాక్ కన్నా, తాను ఉత్తమమైన పాలనను అందించగలనని 51 సంవత్సరాల హను చెబుతున్నారు.

  • Loading...

More Telugu News