: హైదరాబాదు శివార్లలో ఫుల్ ట్రాఫిక్ జామ్


హైదరాబాదు నగర శివార్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాదు వాసులు స్వస్థలాలకు తరలుతున్నారు. హైదరాబాదు నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు సరిపడా ట్రైన్ లు లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇక్కట్లపాలైన ప్రయాణికులు, బస్సులలో వెళ్లేందుకు బస్టాండ్ లకు వెళ్లారు. అక్కడ కూడా విపరీతమైన రద్దీ నెలకొనడం, ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటుండడంతో కుటుంబంతో బయల్దేరిన పలువురు కార్ పూలింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకున్న పలువురు సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయల్దేరారు. దీనికి తోడు భారీ ఎత్తున ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు హైదరాబాదు నుంచి బయల్దేరడంతో నగర శివార్లలో ఉన్న టోల్ గేట్ ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ప్రతి 20 సెకెన్లకు ఒక వాహనం వస్తుండడంతో, 9 కౌంటర్లు పని చేస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదని వాహనదారులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News