: త్రిషకు వీరాభిమానినంటున్న టీమిండియా క్రికెటర్
సినీ నటి త్రిషకు తాను వీరాభిమానినని టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మీ అభిమాన నటులు ఎవరని అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా...'ఇంకెవరు? రజనీకాంత్, త్రిష' అని టక్కున చెప్పేశాడు. తాను ఎనిమిదో తరగతిలో ఉండగా త్రిష నటించిన 'లేసా లేసా' సినిమా చూశానని, అప్పటి నుంచి ఆమెకు అభిమానిగా మారిపోయానని అశ్విన్ వెల్లడించాడు. అంతే కాదు, హైస్కూల్ లో ఉండగా త్రిష అభిమాన సంఘం కూడా ఏర్పాటు చేశానని ఈ స్పిన్నర్ చెప్పాడు. అయితే దానిని రిజిష్టర్ చేయించాలని అప్పట్లో తెలియదని అశ్విన్ పేర్కొన్నాడు. వీలు కుదిరితే కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలు చూస్తానని అశ్విన్ తెలిపాడు.