: కరుడుగట్టిన తీవ్రవాది మౌలానా మసూద్ అజార్ అరెస్టు


పఠాన్ కోట్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ స్పందించింది. దాడికి ప్రధాన సూత్రధారి జైష్-ఎ-మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ను పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పఠాన్ కోట్ ఉగ్రదాడికి సూత్రధారులైన జైషే మొహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ పై పాక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా మసూద్ అజార్ తో పాటు అతని నలుగురు కీలక అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పాకిస్థాన్ కు చెందిన జియో న్యూస్ ఛానెల్ వెల్లడించింది. జైషే సంస్థకు చెందిన కార్యాలయాలపై దాడులు చేసి, అందులోని సభ్యులను అదుపులోకి తీసుకుంటున్న భద్రతా దళాలు ఆ సంస్థ కార్యాలయాలకు సీల్ వేస్తున్నట్టు పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

  • Loading...

More Telugu News