: రైల్వేలకు వచ్చే ఐదేళ్లలో ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం: మనోజ్ సిన్హా
భారతీయ రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చివేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అసోం-అగర్తల మార్గంలో కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ ట్రయల్ రన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వే శాఖలో వినూత్న మార్పులు తీసుకురానున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైల్వే దశను, దిశను మార్చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రయల్ రన్ పూర్తయిన తరువాత ఈ మార్గంలో కొత్త రైలు వేస్తామని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకునే త్రిపుర రైలు మార్గం త్వరలో ప్రారంభించి, 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.