: 'బాలయ్య చిన్నపిల్లాడి'లాంటోడంటున్న అంజలి
టాలీవుడ్ నటుడు బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వమున్న మంచి వ్యక్తి అని నటి అంజలి కితాబు ఇచ్చింది. డిక్టేటర్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో అంజలి, బాలకృష్ణను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా 'నా గురించి ఏమనుకుంటున్నావు?' అంటూ బాలయ్య అడిగారు. దీనికి సమాధానమిస్తూ, 'సానుకూల దృక్పథం ఉన్న మనిష'ని, 'మంచి మనసున్న మనిషి' అని జవాబిచ్చింది. మనసులో ఏమీ ఉంచుకోరని, నిష్కల్మషంగా ఉంటారని తెలిపింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాలయ్య సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ సిరిసంపదలు, ధనధాన్యాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.