: సింగర్ అవతారమెత్తిన నాటి డ్రీమ్ గర్ల్!


అలనాటి అందాల తార, నాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని కొత్త అవతారమెత్తారు.. సింగర్ గా మారారు. ఆమె స్వయంగా పాడిన భజన గీతాలతో ఒక ఆల్బంను రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని హేమమాలిని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. పాటలు పాడటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు. పండిట్ నారాయణ్ అగర్వాల్ రచించిన భజన గీతాలను తాను పాడానని, ప్రముఖ గాయని లతామంగేష్కర్ స్టూడియోలో ఈ ఆల్బంను రూపొందిస్తున్నానని, అందరూ ఆదరించాలని హేమమాలిని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News