: భారత సంతతి గవర్నర్ పై విషం కక్కుతున్న ట్రంప్ మద్దతుదారులు


భారతీయ మూలాలున్న సౌత్ కరొలినా రాష్ట్ర గవర్నర్ నిక్కీ హెలీపై ఆమె పార్టీకే చెందిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విషం కక్కుతున్నారు. అధ్యక్షపదవీ కాలం ముగిసిన సందర్భంగా ఒబామా చేసిన ప్రసంగంపై ట్రంప్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై నిక్కీ హెలీ తన 9 నిమిషాల అభిప్రాయం విడుదల చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. భారత్ నుంచి వలస వచ్చిన తన కుటుంబం అమెరికాలో ఎలా స్థిరపడిందో వివరిస్తూ...అమెరికాకు చట్టప్రకారం వచ్చేవారిని గుడ్డిగా వ్యతిరేకించకుండా, అక్రమ వలసలను మాత్రం అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ (వలస) చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అమెరికాకు రాకుండా భయపెట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్ల, అమెరికాకు విశ్వాసపాత్రంగా ఎవరూ పనిచేసే అవకాశం ఉండకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా తమను ఆహ్వానించడం లేదన్న భావన ఎవర్లోనూ కలగకుండా, చట్టప్రకారం వచ్చే వారిని ఆహ్వానించేలా చట్టాలు మారాల్సిఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె చేసిన ఈ ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అమెరికా నుంచి ట్రంప్ వెళ్లగొట్టాలని అతని మద్దతుదారు, టీవీ వ్యాఖ్యాత అన్ కౌల్టర్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News