: మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ గేట్ ఛార్జీలు తగ్గించిన ఎన్.హెచ్.ఏ.ఐ


మెదక్ జిల్లా తూప్రాన్ వైపుగా వెళ్లే వాహనదారులకు టోల్ గేట్ ఛార్జీల విషయంలో స్వల్ప ఉపశమనం లభించింది. తూప్రాన్ టోల్ గేట్ ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్ గేట్ వద్ద వాహనాల నుంచి ఇకపై ఒకసారి వెళ్లేందుకు రూ.70 వసూలు చేస్తారని తెలిపింది. అలాగే వాహనానికి రాను పోను ఛార్జీ రూ.105 వసూలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు ఈ టోల్ గేట్ వద్ద కారు, జీపు, వ్యాను, ఇతర లైట్ మోటార్ వాహనాలు ఒకసారి వెళ్లడానికి రూ.125, రెండువైపులకు రూ.180 వసూలు చేసేవారు. దానివల్ల తక్కువ దూరం ప్రయాణించే స్థానికులకు భారమవుతోంది. ఈ విషయాన్ని స్థానిక టీఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ కు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎన్ హెచ్ఏఐ ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు టోల్ గేట్ ఛార్జీలు తగ్గించారు.

  • Loading...

More Telugu News