: కొంప ముంచిన అనుకరణ...ఉరి ఎలా వేసుకుంటారో చూపిస్తూ మరణించిన బాలుడు!
అనుకరణ అనేది హద్దు మీరితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మరఠ్వాడా ప్రాంతంలో బీద్ జిల్లాలోని ఓ ఉర్దూ పాఠశాలలో షేక్ సాజిద్ నాలుగో తరగతి చదువుకుంటున్నాడు. స్కూలు నుంచొచ్చిన సాజిద్ తన సోదరుడితో కలసి భోజనం చేసి, సోదరితో కలిసి టీవీ ముందు కూర్చున్నాడు. టీవీలో ఓ ప్రోగ్రామ్ చూస్తూ టీవీల్లో ఎలా ఉరి వేసుకుంటారో అక్కకు అనుకరించి చూపించబోయాడు. 'అక్కా! టీవీల్లో ఇలా ఉరి వేసుకుంటారు' అంటూ తాడు తెచ్చి మెడకు బిగించుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దలు లేకపోవడంతో తాడు బిగుసుకుపోయి, ఆ బాలుడు మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.