: యేల్ యూనివర్శిటీకి ఇంద్రా నూయీ భూరి విరాళం!


అమెరికాలోని యేల్ వర్శిటీకి భారత సంతతి పూర్వవిద్యార్థి భారీ విరాళం అందజేశారు. ఈ విషయాన్ని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రవాస భారతీయురాలు, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రా నూయీ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారన్నారు. అత్యధిక విరాళ మిచ్చిన పూర్వ విద్యార్థుల్లో ఇంద్రా నూయీ మొదటి వ్యక్తి అని అన్నారు. అంతేకాకుండా ప్రఖ్యాతి గాంచిన ఈ బిజినెస్ స్కూల్ నుంచి డీన్ షిప్ పొందిన మొదటి మహిళ కూడా తనేనని యేల్ స్కూల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇంద్రా నూయీ 1980లో యేల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News