: 'ఒబామా ప్రసంగం బోరింగ్' అంటున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీడ్కోలు ప్రసంగం అస్సలు ఆకట్టుకోలేదని అధ్యక్షపదవి ఆశావహుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన అధ్యక్షపదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి ఈరోజు ఆయన చివరిసారిగా 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఆయన ప్రసంగం బోర్ కొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రసంగం వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రసంగాలు గతంలో చాలాసార్లు విన్నానని ఆయన అన్నారు.