: ప్రపంచంలో స్పీడ్ వైఫై హోటల్...1.2 జీబీపీఎస్ స్పీడ్


ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన వైఫై సేవలందించే హోటల్ గా జన్నా బుర్జ్ అల్ సరబ్ ఖ్యాతిగాంచింది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో ట్రాఫిక్ లో ఉన్నా యువత దానితోనే గడుపుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు ఉచిత వైఫై అందజేస్తున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియాలో నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే మినాలో జన్నా బుర్జ్ అల్ సరబ్ హోటల్ ఉంది. ఈ హోటల్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువ. వారిని ఆకట్టుకునేందుకు ఈ హోటల్ యాజమాన్యం ఉచిత వైఫై సౌకర్యం కలుగజేసింది. సాధారణ వేగంతో కాకుండా అత్యంత వేగవంతమైన సౌకర్యం కలుగజేయడం విశేషం. 1.2 జీబీపీఎస్ వేగంతో వైఫై సర్వీసు కల్పించారు. కొద్ది కాలం క్రింతం వరకు 270 ఎంబీపీఎస్ వేగంతో వైఫైను అందించి ఈ హోటల్, ఈ మధ్యే ఆ వేగాన్ని అప్ గ్రేడ్ చేశారు. దీంతో దీని వేగం ఎంబీపీఎస్ నుంచి జీబీపీఎస్ కు మారింది. దీంతో ఈ హోటల్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వైఫై సర్వీసు అందిస్తున్న హోటల్ గా రికార్డులకెక్కింది.

  • Loading...

More Telugu News