: రైతు ప్రాణాలు తీసిన వీధికుక్కలు!
వీధికుక్కలు దాడి చేయడంతో ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన సంఘటన హర్యానాలోని తబ్రా గ్రామంలో చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రైతు శ్రీరామ్(40) పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కల మంద అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీరామ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శ్రీరామ్ శరీరభాగాలు చెల్లాచెదురై ఉండటాన్ని గుర్తించిన ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద సంఘటనపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలకు కు.ని. ఆపరేషన్లు చేయించాలని, తద్వారా వాటి బారి నుంచి బయటపడవచ్చని సంబంధిత అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కాగా, గతంలో కూడా ఇటువంటి విషాద సంఘటన ఈ గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి.