: ఈ మూడింటిలో తేడా వస్తేనా...!: బాలయ్య
సమయపాలన, క్రమశిక్షణ, మర్యాద... ఈ మూడింటిని తాను మొదటి నుంచి పాటిస్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మూడింటిని కేవలం సినిమాలకే పరిమితం చేయలేదని.. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ ఇదే క్రమశిక్షణ పాటిస్తానని చెప్పారు. సినిమా షూటింగ్ కు చెప్పిన సమయం కంటే కొంచెం ముందుగానే చేరుకుంటానని, తన పని తాను చేసుకుపోతానని చెప్పారు. సమయపాలన, క్రమశిక్షణ, మర్యాద పాటించడంలో కచ్చితంగా ఉంటానని, తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ‘డిక్టేటర్’ బాలయ్య చెప్పారు.