: రికార్డు తిరగరాసిన సానియా, మార్టీనా
ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ టోర్నీల్లో సానియా మీర్జా, మార్టీనా హింగిస్ జోడీ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. సానియాతో జోడీ కట్టిన మార్టీనా హింగిస్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. వరుస విజయాలతో వీరిద్దరూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తాజాగా, సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్ లో సానియా జోడీ చెన్ లియాంగ్, షాయ్ పెంగ్ ను ఓడించి, వరుసగా 28వ విజయం సొంతం చేసుకున్నారు. దీంతో వరుసగా 28 విజయాలు సాధించిన రెండవ జోడీగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు. వీరికంటే ముందు 1994లో జిగి ఫెర్నాండెజ్, నటాషా జెరెవా వరుసగా 28 మ్యాచుల్లో విజయం సాధించారు. తాజా విజయంతో వీరు ఆ రికార్డును సమం చేశారు.