: డ్యాన్స్ చేస్తూ గాయపడ్డ బాలీవుడ్ నటుడు


బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ డాన్స్ చేస్తూ గాయపడ్డాడు. ఇటీవల ముంబైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా వరుణ్ ధావన్ కిందపడ్డాడు. ఈ సందర్భంగా కాస్త తీవ్రమైన దెబ్బతగిలినట్టు సమాచారం. దాని నుంచి కోలుకుని తాను నటిస్తున్న 'ఢిషూం' సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు వరుణ్ కాలికి మళ్లీ గాయమైంది. దీంతో షూటింగ్ రద్దు చేసుకుని వెళ్లిపోయాడు. ఈ గాయం కారణంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా హాజరుకాలేకపోయాడు.

  • Loading...

More Telugu News