: చంద్రబాబు మాత్రమే ఏపీని అభివృద్ధి చేయగలరు: ఆనం రాంనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ను ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేయగలరన్న నినాదాన్ని ఇప్పుడు మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కూడా అందుకున్నారు. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కూడా టీడీపీ చేస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రఘువీరా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని ఆనం సూచించారు. నెల్లూరులో ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆనం, పదవుల కోసం పార్టీ మారటం లేదని ఉద్ఘాటించారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. ఈ నెల 17న 4వేల మంది అనుచరులతో టీడీపీలో చేరుతున్నామని చెప్పారు.