: టెన్షన్ టెన్షన్... అమెరికన్ నేవీ బోట్లలోని పది మందిని అరెస్ట్ చేసిన ఇరాన్


తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ, రెండు అమెరికన్ నేవీ బోట్లలోని పది మందిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. నేడో, రేపో అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న వేళ ఈ ఘటన జరగడం గమనార్హం. ఇరాన్ అరెస్ట్ చేసిన తమ వారిని క్షేమంగా విడిచిపెడతారని భావిస్తున్నట్టు అమెరికన్ అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుఝామున జరిగింది. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఉన్నామని అమెరికన్లు అంటుండగా, తమ జలాల్లోకి రావడంతోనే అదుపులోకి తీసుకున్నామని ఇరాన్ చెబుతోంది. అరెస్టయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారని వైట్ హౌస్ ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ సీఎన్ఎన్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News