: 'కబడ్డీ కబడ్డీ' అన్న పీతల సుజాత... ఒంటెక్కిన మాగంటి బాబు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పీతల సుజాత, మాగంటి బాబు తదితరులు పాల్గొని ఆడి పాడారు. సంబరాల్లో భాగంగా బాడీ బిల్డర్ల మధ్య పోటీలతో పాటు మగువలకు ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. మంత్రి పీతల సుజాత సరదాగా కాసేపు 'కబడ్డీ కబడ్డీ' అంటూ మహిళా నేతలతో కలసి కబడ్డీ ఆడారు. ఆపై సంప్రదాయ వస్త్రాలు ధరించి కోలాటం ఆడుతున్న యువతుల మధ్యన చేరి, వారితో కలిసి పాదం కలిపారు. తొలుత బాడీ బిల్డర్ల మధ్య నిలబడి తన బాడీని చూపిన మాగంటి బాబు, ఆపై ఒంటెనెక్కి సవారీ చేశారు.