: మౌత్ ఆర్గాన్ వాయిస్తూ... స్వామివారి సేవ చేస్తున్న 'గజ'లక్ష్మి!


ఏనుగు ఏంటి... మౌత్ ఆర్గాన్ వాయించడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? భారీకాయంతో ఘీంకారం చేస్తుండే గజరాజు ఇలా సంగీతాన్ని ఎలా పలికిస్తోంది? అని అనుకుంటున్నారా? ఆ వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తూటుకుడి జిల్లాలో రెత్తయ్ తిరుపతి ఆలయంలో ఓ ఏనుగు ఉంది. దాని పేరు లక్ష్మి. వయసు 10 సంవత్సరాలు. దానికి ఏడాది వయసున్నప్పుడు శ్రీలంక నుంచి దానిని ఆ ఆలయానికి తీసుకువచ్చారు. అప్పటినుంచి ఈ ఏనుగును మావటి బాలన్ సంరక్షణ బాధ్యతలు చూస్తుంటాడు. అతను ప్రతిరోజు మౌత్ ఆర్గాన్ వాయిస్తాడు. బాలన్ వాయిస్తున్నప్పుడు ఆ ఏనుగు కూడా శ్రద్ధగా ఆలకించేదట. ఈ విషయాన్ని గమనించిన బాలన్ దానికి కూడా మౌత్ ఆర్గాన్ వాయించడం నేర్పించాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుని ఇప్పుడు లక్ష్మి వీనులవిందుగా వాయించేస్తోంది. ఇలా ప్రతిరోజు ఆలయంలో ఉదయం, సాయంత్రం అరగంట పాటు వాయిస్తూ స్వామివారికి సేవ చేస్తూ, అక్కడికి వచ్చే భక్తులను ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News