: 107 మంది వారసుల మధ్య తుది వీడ్కోలు తీసుకున్న 114 ఏళ్ల తమిళ బామ్మ!
ఆమె పేరు కృష్ణమ్మాళ్. తమిళనాట అందరూ బామ్మగా పిలుచుకునే కృష్ణమ్మాళ్ వయసు 114 సంవత్సరాలు. శతాధిక వృద్ధురాలైన ఆమె కుటుంబం కూడా పెద్దదే. 1902లో జన్మించిన ఆమెకు ఇద్దరు కుమారులు. ఆపై కూడా నాలుగు తరాలను చూశారు. ఏ విధమైన అనారోగ్య సమస్యలనూ ఎదుర్కోని ఆమె, సహజ మరణం చెందడంతో, దాదాపు 107 మందికి పైగా ముని మనవళ్లు, ముని మనవరాళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు. కృష్ణమ్మాళ్ భర్త మునుస్వామి పదేళ్ల క్రితం మరణించగా, అప్పటి నుంచి ఆమె తనవారితోనే ఉంటున్నారు. వివిధ దేశాలు, భారత్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆమె వారసులు భారీ సంఖ్యలో తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.