: రిపబ్లిక్ డే రిహార్సల్స్ లో అపశృతి... కారు ఢీ కొనడంతో అధికారి దుర్మరణం!


రిపబ్లిక్ డే రిహార్సల్స్ ను పర్యవేక్షిస్తున్న ఎయిర్ ఫోర్స్ అధికారిని ఒక కారు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఈరోజు జరిగింది. ఉదయం 6.30 గంటలకు రెడ్ రోడ్ లో నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే పరేడ్ ను కార్పొరల్ అభిమన్యు గౌడ్(30) పర్యవేక్షిస్తున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఆడికారు అభిమన్యుని ఢీ కొట్టుకుంటూ వెళ్లింది. అక్కడి బారికేడ్లను ఢీ కొట్టిన అనంతరం ఆ కారు ఆగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ సదరు అధికారిని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన మృతి చెందాడు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News