: కోడి పందేలకు అనుమతి కోరుతూ... కేంద్ర హోంమంత్రిని కలవనున్న ప్రజాప్రతినిధులు
కోడి పందేలపై కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల వారు లేఖ రాశారు. వారితో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు, ప్రజాసంఘాల వారు లేఖ రాశారు. తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తిపై జల్లికట్టును సాంప్రదాయ క్రీడగా ప్రకటిస్తూ కేంద్రం ఈరోజు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జల్లికట్టు తరహాలో కోడిపందేలను కూడా సాంప్రదాయ క్రీడగా పరిగణించాలని కోరారు. ఈ మేరకు కోడిపందేలపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని పలువురు ప్రజాప్రతినిధులు కలిసే అవకాశం ఉందని సమాచారం.