: రేపిస్ట్ ముద్ర వేశారని... కనిపించకుండా పోయిన టీవీ నటుడు


బాలీవుడ్ హిట్ చిత్రాలు మున్నాభాయ్ ఎంబీబీఎస్, చాందినీ బార్ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలతో పాటు కలర్స్ టీవీలో ప్రసారమైన కార్యక్రమాల్లో ఓ వెలుగు వెలిగిన యువ నటుడు విశాల్ ఠక్కర్ ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయాడు. గర్ల్ ఫ్రెండ్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ముంబైకి తిరిగివస్తూ ఉన్నట్టుండి అతడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతడి సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. తనపై ఠక్కర్ రేప్ చేశాడని అతడి గర్ల్ ఫ్రెండ్ రజనీ రాథోడ్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడిపై కేసు నమోదు కాగా, తదనంతర కాలంలో మళ్లీ వారిద్దరి మధ్య అవగాహన కుదిరింది. ఈ క్రమంలో రజనీ తన ఫిర్యాదును వాపస్ తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపిస్ట్ గా ముద్రపడ్డ ఠక్కర్ కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఠక్కర్... న్యూ ఇయర్ ను గర్ల్ ఫ్రెండ్ తో కలిసి జరుపుకుని ఈ నెల 1న కనిపించకుండా పోయాడు. ఠక్కర్ అదృశ్యంపై అతడి తల్లిదండ్రులు ఈ నెల 6 ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రజనీని కూడా పోలీసులు విచారించారు. అయినా చిన్న క్లూ కూడా దొరకలేదు.

  • Loading...

More Telugu News