: 640 మంది ప్రభుత్వ వైద్యులకు ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు


ప్రభుత్వ వైద్యులు 640 మందికి ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీఎంఈలో 240, ఏపీవీవీపీలో 190, డీఎంహెచ్ లో 210 మందికి ఈ నోటీసులు పంపారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సక్రమంగా విధులకు హాజరుకాని వారికే నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారని వైద్యులపై ఆరోపలు వచ్చాయంటుండగా, వైద్యులు వాటిని ఖండిస్తున్నారు. తమ వివరణ కోరకుండానే ఎలా నోటీసులు ఇస్తారని వైద్యశాఖ ఉన్నతాధికారితో భేటీలో వీరు ప్రశ్నించారు. వైద్యుల వ్యవహారాల్లో కలెక్టర్ల జోక్యం ఎక్కువైందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News