: శ్రీవారి సేవలో చంద్రబాబు సతీమణి... తిరుమలకు క్యూ కట్టిన రాజకీయ, సినీ ప్రముఖులు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. రోటీన్ కు భిన్నంగా ఒంటరిగానే తిరుమలకు వచ్చిన భువనేశ్వరి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ డిప్యూటీ ఈఓ శ్రీనివాసరాజు దగ్గరుండి భువనేశ్వరికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే, నేడు తిరుమలకు రాజకీయ, సినీ ప్రముఖులు క్యూ కట్టారు. వెంకన్నను దర్శించుకున్న చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీకి లక్ష కోట్ల మేర పెట్టుబడులు రావడం ఖాయమని ప్రకటించారు.