: జైషే చీఫ్ తల తెగనరకండి... రూ.1 కోటి తీసుకోండి: శివసేన సంచలన ప్రకటన


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిపై మరాఠా పార్టీ శివసేన ఘాటుగా స్పందించింది. ఈ నెల 2న తెల్లవారుజామున ఎయిర్ బేస్ పై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు ఏడుగురు సైనికులను బలిగొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటర్ అటాక్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ముందు ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని తమ కుటుంబ సభ్యులతో పాటు తమ బాసు, దాడికి సూత్రధారుడిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ తోనూ మాట్లాడారు. ఈ మేరకు ఉగ్రవాదులు వినియోగించిన ఫోన్ నెంబర్లతో పాటు వారి వాయిస్ రికార్డులు దొరికిపోయాయి. ఈ నేపథ్యంలో నిన్న శివసేన పంజాబ్ శాఖ సంచలన ప్రకటన జారీ చేసింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఉగ్రవాద దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మౌలానా తల తెగనరికిన వారికి రూ.1 కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శివసేన పంజాబ్ శాఖ నేత యోగేశ్ బతీశ్ సంచలన ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News