: హెచ్-1బీ, ఎల్-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుము పెంచిన అమెరికా
హెచ్-1బీ, ఎల్-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాల వారు అదనపు రుసుముగా 4వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఎల్-1ఎ, ఎల్-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వెల్లడించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమనీ, 2025 సెప్టెంబర్ 30 వరకు ఈ రుసుములు అమల్లో ఉంటాయని తెలిపింది. నూతన చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని సమకూర్చని హెచ్-1బి, ఎల్-1 వీసా దరఖాస్తుల్ని ఫిబ్రవరి 11 నుంచి తిరస్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీసా రుసుముల పెంపు ప్రధానంగా భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపనుంది.