: ఒబామాకు వీడ్కోలుగా వెల్లువెత్తుతున్న 'కన్నీటి సెల్ఫీ'లు!


ఇకపై అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉండబోరన్న విషయం అమెరికన్ల మదిలో తీరని బాధను కలిగిస్తోంది. మృదు స్వభావిగా, నిత్యమూ ప్రజలతో కలిసుంటూ, వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటూ, వైట్ హౌస్ లో ఉన్నా, తనదైన శైలిలో ప్రజల్లో కలిసిపోయి పాలన సాగించిన నేతగా పేరు తెచ్చుకున్న ఒబామా, జాతిని ఉద్దేశించి చేసిన చివరి ప్రసంగం తరువాత సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది 'తమకు ఏడుపు వస్తోంది' అని చెబుతూ కన్నీటి సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నారు. "బరాక్, మీరు దూరం కావద్దు" అని ఒకరు, "మిస్టర్ ప్రెసిడెంట్ మీరే కొనసాగాలి" అని ఇంకొకరు, "మీరు లేని వైట్ హౌస్ ను ఊహించలేకపోతున్నాం" అని మరొకరు, "మీరు చివరి ప్రసంగం చేస్తున్నారంటే నమ్మలేకున్నాం"... ఇలా సాగుతున్నాయి ట్వీట్లు. వీరందరినీ ఉద్దేశించి ఒబామా సైతం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. తానెక్కడికీ వెళ్లడం లేదని, ప్రజల్లో కలిసేందుకు వస్తున్నానని బదులిచ్చారు.

  • Loading...

More Telugu News