: ఐఎస్ఐఎస్ లో ఉద్యోగం కావాలంటే...!


ఇస్లామిక్ స్టేట్ లో ఉద్యోగం పొందిన న్యూజిలాండ్ కు చెందిన ఒక వ్యక్తి తన లింకెడిన్ అకౌంట్ లో తాను ఎడ్యుకేషన్ మేనేజిమెంట్ ప్రొఫిషనల్ గా పనిచే్స్తున్నానని తెలిపాడు. తాను ఇస్లామిక్ స్టేట్ లో పనిచేస్తున్నానని, ఇక్కడ ఎంతో బాగుందని, తనలా ఇక్కడికి ఉద్యోగాలకు వచ్చేవారిని ప్రోత్సహిస్తానని న్యూజిలాండ్ నుండి వచ్చిన మహమ్మద్ డేనియల్ దానిలో పేర్కొన్నాడు. అయితే తాను ఉద్యోగంలో చేరిన తరువాత తన పేరును మార్క్ జాన్ టేలర్ గా మార్చుకున్నానని తన ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. పైగా ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదని, కుటుంబంతో ప్రశాంతంగా ఉంటున్నానన్నాడు. అయితే కొంతకాలానికి డేనియల్ తన న్యూజిలాండ్ పాస్ పోర్టు కాలిపోయిందని వెల్లడించాడు. 2014లో సోషల్ మీడియాలో చోటుచేసుకున్న ఇటువంటి ఉదంతాలు ఇప్పటికీ ఐఎస్ఐెస్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్నాయని అక్కడి నిఘా వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News