: కాపీరైట్ వివాదంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి విష్ణుసహస్రనామాలు...యూ ట్యూబ్ లో బ్లాక్ అయిన వైనం!


గత రెండు రోజులుగా యూట్యూబ్ లో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామాలను వినాలనుకునేవారికి నిరాశ ఎదురవుతోంది. దీనికి సంబంధించిన పలు యూట్యూబ్ లింకులను కూడా బ్లాక్ చేశారు. దీనిపై నెటిజన్లు, ఎంఎస్ సుబ్బులక్ష్మి అభిమానులు, సంగీత ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. 2014 లో కూడా ఇదే విధంగా త్యాగరాజస్వామి కీర్తనలను బ్లాక్ చేశారని వారు ఆరోపించారు. కాగా దీనిపై ప్రముఖ గాయకుడు లలితారామ్ మాట్లాడుతూ కాపీరైట్ సమస్య కారణంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామాల వీడియోను బ్లాక్ చేశారని తెలిపారు. దీనికి తోడు ఇదే శైలిని అనుసరించి ఉన్న అన్ని వెబ్ సైట్ లను బ్లాక్ చేశారని వివరించారు. అయితే ఈ వీడియోను ప్రముఖ మ్యూజిక్ సంస్థ 'సరిగమ' రూపొందించిందని, కాపీరైట్ హక్కులను కాపాడుకునేందుకు సంస్థ ఈ వీడియోను బ్లాక్ చేసిందని యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News